Indigo: దేశీయంగా ఎంపిక చేసిన రూట్లలో బిజినెస్ క్లాస్... ఇండిగో కీలక నిర్ణయం

Indigo introducing business class in domestic routes
  • భారత్ లోని 12 మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్న ఇండిగో
  • రేపటి నుంచే బుకింగ్
  • సంస్థ కార్యకలాపాలకు 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకటన
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో  కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఎంపిక చేసిన రూట్లలోనూ ఇకపై బిజినెస్ క్లాస్ ప్రవేశపెట్టనుంది. బిజినెస్ క్లాస్ టికెట్లను రేపటి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఇండిగో సంస్థ విమాన సర్వీసులు ప్రారంభించి 18 ఏళ్లయిన సందర్భంగా ఈ ప్రకటన చేసింది. 12 ఎంపిక చేసిన మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. 

దేశీయ రూట్లలో ఇప్పటివరకు ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానాల్లో మాత్రమే బిజినెస్ క్లాస్ అందుబాటులో ఉంది. ఇప్పుడీ జాబితాలో ఇండిగో కూడా చేరింది. 

దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో వాటా 61 శాతం. ఇండిగో సంస్థ ప్రతి రోజూ 33 విదేశీ నగరాలతో సహా మొత్తం 120 గమ్యస్థానాలకు దాదాపు రెండు వేల సర్వీసులు నడుపుతోంది.
Indigo
Business Class
Domestic Routes
India

More Telugu News