Manu Bhaker: మను భాకర్‌ను సత్కరించిన నీతా అంబానీ

Nita Ambani felicitates Double Olympic medallist Manu Bhaker
  • ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను భాకర్
  • 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుశాలే
  • కుశాలేను కూడా సత్కరించిన నీతా అంబానీ
ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన యువషూటర్ మను భాకర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్, ఐవోసీ సభ్యురాలు నీతా అంబానీ సత్కరించారు. మను భాకర్‌తో పాటు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుశాలేను కూడా సత్కరించారు.

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ... ఈ ఒలింపిక్స్‌లో మన షూటింగ్ టీమ్ అత్యుత్తమ ఫామ్‌లో ఉందన్నారు. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో పతకం గెలిచిన మొదటి ఇండియన్‌గా స్వప్నిల్ కూడా చరిత్ర సృష్టించారన్నారు. స్వప్నిల్ కుశాలేకు అందరం శుభాకాంక్షలు చెబుదామన్నారు.
Manu Bhaker
Nita Ambani
Paris Olympics

More Telugu News