Raja Singh: ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి

MLA Rajasingh open letter to Chandrababu Naidu
  • చంద్రబాబుకు తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ బహిరంగ లేఖ
  • ఏపీలోని పురాతన దేవాలయాలను రక్షించాలని విజ్ఞప్తి
  • దేవాలయాల భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ రాష్ట్ర గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ విజ్ఞప్తి చేశారు. ఏపీలోని పురాతన దేవాలయాలను వివిధ మతాల వారు ఆక్రమించుకున్నారని, వాటిని సంరక్షించాలని కోరారు. దేవాలయాల భూములను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

అనేక పురాతన హిందూ దేవాలయాలు ఇతర మతాల వారి ఆధీనంలోకి వెళ్లాయని, వారు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు తెరుస్తున్నారని, మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అటువంటి ఆక్రమణల నుండి ఈ దేవాలయాలన్నింటికి వెంటనే విముక్తి కల్పించాలని కోరుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు సూచనలు చేశారు.
Raja Singh
Chandrababu
Andhra Pradesh
Telangana

More Telugu News