Wayanad: వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం

Prabhas donated rs 2 crores to Wayanad Landslide
  • కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు వెల్లడి
  • ఇప్పటికే విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్
  • వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతి
వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకొని సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు. జులై 30న కురిసిన కుంభవృష్ఠితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో వందలాదిమంది మృతి చెందారు.

వయనాడ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, తాను కలిసి కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు చిరంజీవి ఎక్స్ వేదికగా ఇటీవల వెల్లడించాడు. అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించాడు. కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కూడా విరాళం ఇచ్చారు.
Wayanad
Prabhas
Kerala

More Telugu News