Saina Nehwal: వినేశ్ ఫొగాట్ విషయంలో ఈ తప్పు ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకం: సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్య

Saina Nehwal attacks Vinesh Phogat after disqualification
  • ఫొగాట్ ప్రదర్శన కోసం మూడు రోజులుగా ఉత్సహంగా ఎదురు చూస్తున్నానన్న సైనా
  • ఆమె బరువు పెరిగి ఉండవచ్చు... కానీ ఆమె ఓ ఫైటర్ అన్న సైనా నెహ్వాల్
  • వచ్చేసారి కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశాభావం
వినేశ్ ఫొగాట్ ప్రదర్శన కోసం తాను గత రెండు మూడు రోజులుగా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుందని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాములు అదనంగా బరువు ఉండటంతో నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు.

తాజాగా సైనా నెహ్వాల్ స్పందిస్తూ... ఫొగాట్ ప్రదర్శన కోసం తాను వేచి చూస్తున్నానన్నారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించడానికి ప్రతి అథ్లెట్ కఠినమైన శిక్షణ తీసుకుంటారని పేర్కొన్నారు. వినేశ్ ఫొగాట్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుందని, ఆమె గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదన్నారు. ఇప్పుడు ఆమె బరువు పెరిగి ఉండవచ్చు... కానీ ఆమె ఫైటర్.... వచ్చేసారి కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సాధారణంగా ఇలాంటి తప్పులు ఏ అథ్లెట్ విషయంలోనూ జరగవని, కానీ ఇది ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారిందని కీలక వ్యాఖ్య చేశారు. వినేశ్ ఫొగాట్‌కు ఇదే మొదటి ఒలింపిక్స్ కాదని... ఆమె కూడా ఇందుకు బాధ్యురాలే అన్నారు. ఆమె వెంట ఉన్న చాలామంది కోచ్‌లు, ఫిజియోలు ఎంతో బాధలో ఉన్నారన్నారు. రెజ్లింగ్ నిబంధనలు అయితే తనకు తెలియవని, కానీ ఫొగాట్ విషయంలో తాను చాలా బాధపడుతున్నానన్నారు.
Saina Nehwal
Vinesh Phogat
Paris Olympics

More Telugu News