Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు అంశంపై తీవ్రంగా స్పందించిన పంజాబ్ సీఎం

Punjab CM Bhagwant Mann visits family of Vinesh Phogat in Haryana
  • 100 గ్రాముల బరువుకే అనర్హత సరికాదన్న భగవంత్ మాన్
  • ఆమెపై వేటు పడటంతో బంగారు పతకం దూరమైందని వ్యాఖ్య
  • ఫొగాట్ వెయిట్ పెరిగితే కోచ్, ఫిజియో థెరఫిస్ట్ ఏం చేస్తున్నారని ప్రశ్న
కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉండటంతోనే వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడం సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఆమెపై వేటు పడటంతో భారత్‌కు బంగారం పతకం దూరమైందన్నారు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. బరువును తగ్గించడం కోసం జుట్టును కూడా కట్ చేసినట్లు కుటుంబ సభ్యులు తనతో చెప్పారన్నారు. ఫొగాట్ వెయిట్ పెరిగితే కోచ్, ఫిజియోథెరఫిస్ట్ ఏం చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు. పంజాబ్ సీఎం నిన్న హర్యానాలోని వినేశ్ ఫొగాట్ నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్

వినేశ్ ఫొగాట్ అనర్హత నేపథ్యంలో రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్ పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. కేవలం వారి హృదయాలు మాత్రమే ద్రవిస్తున్నట్లుగా ప్రతిపక్షాల సభ్యులు భావిస్తున్నారని, ఆ యువతికి జరిగిన ఘటనకు దేశం మొత్తం బాధపడుతోందన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లే అన్నారు. ఆమె ప్రయాణం ఇంకా ఎంతో ఉందన్నారు.
Vinesh Phogat
Paris Olympics
Rajya Sabha

More Telugu News