Vinesh Phogat: సిల్వర్ మెడల్ కోసం స్పోర్ట్స్ కోర్టుకు ఇండియా... వినేశ్ ఫొగాట్‌కు భారీ ఊరట!

CAS has accepted the protest appeal against disqualification from Vinesh Phogat
  • కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ మెట్లు ఎక్కిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
  • అనర్హత వేటుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సమర్థించిన సీఏఎస్
  • ఫొగాట్ తరఫున వాదనలు వినిపించనున్న జోయెల్, ఎస్టేల్ ఇలనోవా
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు పారిస్ స్పోర్ట్స్ కోర్టులో భారీ ఊరట దక్కింది. అధిక బరువు కారణంగా ఆమె ఫైనల్ మ్యాచ్ మాత్రమే ఆడలేకపోయిందని, కాబట్టి సిల్వర్ మెడల్‌కు అర్హురాలు అంటూ ఆమె తరఫున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్... కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) మెట్లు ఎక్కింది. ఈ కోర్టులో ఆమెకు భారీ ఊరట లభించింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభిప్రాయపడింది.

ఈ పిటిషన్‌కు సంబంధించి సాయంత్రం ఐదున్నరకు వాదనలు ప్రారంభమవుతాయి. వినేశ్ ఫొగాట్ తరఫున జోయెల్ మోన్లూయీస్, ఎస్టేల్ ఇలనోవా వాదనలు వినిపించనున్నారు. ఆమె పిటిషన్‌ను కోర్టు సమర్థించి... వాదనలు విననుండటంతో సిల్వర్ మెడల్ ఆశలు సజీవంగా కనిపిస్తున్నాయి.

సిల్వర్ మెడల్ ఇవ్వండి: అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లర్

వినేశ్ ఫొగాట్‌కు సిల్వర్ పతకం ఇవ్వాలని ప్రముఖ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లర్ జోర్డాన్ బరోస్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆమె సిల్వర్ మెడల్‌కు అర్హురాలని అభిప్రాయపడ్డారు. జోర్డాన్ బరోస్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ గెలిచారు. 2012లో లండన్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం గెలిచాడు.
Vinesh Phogat
Sports News
Paris Olympics
India

More Telugu News