Asaduddin Owaisi: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు... జేపీసీలో అసదుద్దీన్ సహా తెలంగాణ, ఏపీ నుంచి వీరే...!
- తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఏపీ నుంచి శ్రీకృష్ణదేవరాయులు
- జేపీసీలో సభ్యులుగా 21 మంది లోక్ సభ ఎంపీలు
- జేపీసీ సభ్యులుగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం 21 మంది లోక్ సభ సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. జేపీసీలో పదిమంది రాజ్యసభ సభ్యులు కూడా ఉండనున్నారు. నిన్న వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం... ప్రతిపక్షాల డిమాండ్‌తో జేపీసీకి పంపించేందుకు అంగీకరించింది. ఈరోజు జేపీసీని ఏర్పాటు చేసింది. జేపీసీలో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ డీకే అరుణ, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సభ్యులుగా ఉన్నారు.
లోక్ సభ ఎంపీలు గౌరవ్ గొగొయ్, ఇమ్రాన్ మసూద్, మహమ్మద్ జావెద్, కల్యాణ్ బెనర్జీ, జగదాంబికా పాల్, నిషికాంత్ దుబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకియా, ఏ రాజా, ఢిలేశ్వర్, అర్వింద్ సావంత్, నరేశ్ మస్కే, అరుణ్ భారతి, అపరాజిత సారంగి, సంజయ్ జైశ్వాల్, అభిజిత్ గంగోపాధ్యాయ, మొహమ్మద్ జావెద్, మౌలానా మోహిబుల్లా నాద్వి, సురేశ్ గోపినాథ్ జేపీసీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.