Amrapali: ఆమ్రపాలి వ్యాఖ్యలపై జీహెచ్ఎంసీ కార్మికుల ఆందోళన
- చెత్త కలెక్ట్ చేసేవారు రోజూ ప్రతి ఇంట్లోని చెత్తను తీసుకెళ్లాలన్న ఆమ్రపాలి
- కానీ అలా జరగడం లేదన్న జీహెచ్ఎంసీ కమిషనర్
- తన ఇంట్లోని చెత్తను కూడా అప్పుడప్పుడు తీసుకెళ్లడం లేదని వ్యాఖ్య
జీహెచ్ఎంసీలో చెత్త సేకరణపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలపై చెత్త సేకరణ కార్మికులు ఆందోళన చేపట్టారు. తన ఇంట్లోని చెత్తను కూడా సేకరించేందుకు రావడం లేదని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై కార్మికులు నిరసన తెలుపుతున్నారు.
ఇటీవల ఆమె మాట్లాడుతూ... రోజు చెత్త ఆటో వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆధునిక పద్ధతులు ఉపయోగించాల్సిన అవశ్యకతను చెప్పారు. చెత్త సేకరించేవారు రోజూ ప్రతి ఇంటికి వచ్చి చెత్తను తీసుకోవాలని చేయాలని, కానీ అలా జరగడం లేదని, మా ఇంట్లో కూడా చెత్తను తీసుకువెళ్లడానికి అప్పుడప్పుడు రావడం లేదని, దీంతో తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు.