Daggubati Purandeswari: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తో ఏపీ ఎంపీలు పురందేశ్వరి, దగ్గుమళ్ల ప్రసాదరావు భేటీ
- రాష్ట్రంలోని మామిడి రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పణ
- తోతాపురి మామిడికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఏపీ ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుమళ్ల ప్రసాదరావు నేడు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. రాష్ట్రంలోని మామిడి రైతుల సమపై వారు కేంద్రమంత్రికి వినతిపత్రం అందించారు. తోతాపురి మామిడిని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చాలని కోరారు. టన్ను తోతాపురి మామిడికి రూ.25 వేలు మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు ఎంపీల వెంట రైతు ప్రతినిధులు కూడా ఉన్నారు. వారు చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎదుట ప్రస్తావించారు. మాంగో పల్ప్ ఫ్యాక్టరీలు సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రతినిధి బృందం వినతుల పట్ల శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో చర్చించి ఏపీలోని మామిడి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.