Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో 9 కేసులు నమోదు!

Nine cases files in related to Duvvada issue
  • వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చ రచ్చ
  • దువ్వాడ మరో మహిళతో కలిసి ఉంటున్నాడని భార్య ఆరోపణ
  • భార్యను ఇంట్లోకి రానివ్వని దువ్వాడ!
  • పరస్పరం కేసులు పెట్టుకున్న వైనం
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కొన్ని రోజులుగా మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడంటూ ఆయన భార్య వాణి, కుమార్తె హైందవి మీడియాకెక్కడం తెలిసిందే. 

తాజాగా దువ్వాడ కుటుంబ వ్యవహారానికి సంబంధించి టెక్కలి పోలీస్ స్టేష్ లో 9 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, భార్య వాణి, కుమార్తె హైందవిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్.... తన భార్య వాణి, కుమార్తె హైందవిపై ఫిర్యాదు చేయగా.... వారు కూడా దువ్వాడపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే టెక్కలిలోని దువ్వాడ నివాసం వద్ద పోలీసులు మోహరించారు. 

కాగా, గత అర్ధరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. గత రెండ్రోజులుగా భార్య వాణిని, కుమార్తె హైందవిని ఇంట్లోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ అనుమతించడంలేదు. నిన్న రాత్రి 9 గంటల వరకు వాణి, హైందవి మూసి ఉంచిన గేట్ల వద్ద ఎదురుచూసి అక్కడ్నించి వెళ్లిపోయారు. గంట తర్వాత వారు మళ్లీ అక్కడికి రాగా, ఓ గేటు తెరిచి ఉంచడంతో వారిద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. 

అయితే, ఎమ్మెల్సీ దువ్వాడ తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని లోపలికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా దువ్వాడ సోదరుడికి... వాణి, హైందవిలకు మధ్య వాగ్వాదం జరిగింది. "ఆడవాళ్లకు ఉండాల్సిన లక్షణాలే లేవు" అంటూ దువ్వాడ సోదరుడు వ్యాఖ్యానించగా... "నీకు ఉంది మగవాళ్లకు ఉండాల్సిన లక్షణం!" అంటూ దువ్వాడ భార్య వాణి దెప్పిపొడిచారు.

దువ్వాడకు, భార్య వాణికి గత ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది. రహదారి పక్కనే కొత్త ఇల్లు నిర్మించుకున్న దువ్వాడ... అందులో మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Duvvada Srinivas
Vani
Haindavi
MLC
Police
Tekkali

More Telugu News