Virat Kohli: అభిమానం వెర్రిత‌ల‌లు.. బోర్డు ప‌రీక్ష‌లో విరాట్ కోహ్లీ పేరు రాసిన విద్యార్థి!

Virat Kohli Class of RCB Takes Bihar School Exam

  • స్కూల్ పేరుగా ఐపీఎల్‌, రూల్ నంబ‌ర్‌గా 18 
  • త‌ల్లిదండ్రుల పేరు ప్రేమ్‌నాథ్ కోహ్లీ, స‌రోజ్ కోహ్లీ
  • నెట్టింట వైర‌ల్ అవుతున్న విద్యార్థి జ‌వాబు ప‌త్రం

బిహార్‌కు చెందిన ఓ బాలుడికి విరాట్ కోహ్లీ, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) అంటే ఎన‌లేని అభిమానం. అది ప‌రాకాష్ఠ‌కు చేరి బోర్డు ప‌రీక్ష‌లో త‌న పేరును విరాట్ కోహ్లీ అని, రోల్ నంబ‌ర్‌ను 18 అని, ఆర్‌సీబీ క్లాసులో చ‌దువుతున్న‌ట్లు రాశాడు. 

అలాగే త‌ల్లిదండ్రుల పేర్ల కాల‌మ్‌లో కోహ్లీ పేరెంట్స్ పేర్ల‌ను రాశాడు. తండ్రి పేరుగా ప్రేమ్‌నాథ్ కోహ్లీ, తల్లి పేరుగా స‌రోజ్ కోహ్లీగా రాశాడు. ఇక స్కూల్ పేరును ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) గా రాయ‌డం జ‌రిగింది. 

అలాగే ఓఎంఆర్ ఆప్ష‌న్ల‌లో జవాబుల‌కు బ‌దులు '18ఆర్‌సీబీ' అని నింపాడు. ఈ జవాబు ప‌త్రం తాలూకు పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో ఇదెక్క‌డి అభిమానం అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 

'అది త‌ప్పు. ఆర్‌సీబీ ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 17 సార్లే పాల్గొంది. వ‌చ్చే ఏడాది 18 అవుతుంది' అంటూ ఓ నెటిజ‌న్ కరెక్షన్ ఇచ్చాడు. 'విరాట్ కోహ్లీ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌డానికి బ్రో తీవ్రంగా కృషి చేస్తున్నాడు' అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News