Srisailam: చిన్న చిన్న పడవలలో చేపల వేటకు మత్స్యకారులు... శ్రీశైలం వద్ద అద్భుత దృశ్యం.. వీడియో ఇదిగో
- ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గడంతో గేట్ల మూసివేత
- ఈరోజు ఉదయం చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు
- నెట్టింట వైరల్గా మారిన వీడియో
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గిపోవడంతో సోమవారం సాయంత్రం శ్రీశైలం జలాశయానికి సంబంధించి తొమ్మిది గేట్లను మూసివేశారు. గేట్లు మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు ఈరోజు ఉదయం ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరారు. చిన్న చిన్న పడవలలో నదిపై వేటకు వెళుతుండగా ఎవరో వీడియో తీసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.
వేట కోసం పదులు.. వందల సంఖ్యలో మత్స్యకారులు ఆ చిన్న చిన్న పడవల్లో వేగంగా వెళుతున్నట్లుగా ఉన్న ఈ అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీశైలం డ్యాంలో ఒక గేటు నుంచి మాత్రమే నీటిని వదులుతుండగా... మత్స్యకారులు చేపలు పట్టేందుకు ముందుకు కదులుతున్నారు.
అయితే చాలామంది లైఫ్ జాకెట్లు, నదిలోకి వెళ్లేటప్పుడు కావాల్సిన ఇతర ఎమర్జెన్సీ పరికరాలు లేకుండా వెళ్లడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా లింగాలగట్టు గ్రామానికి చెందిన వారిగా చెబుతున్నారు. అధికారుల భారీ వరద నీరు హెచ్చరికలను లెక్కచేయకుండా వారు నదిలోకి వెళ్ళారని అంటున్నారు.