Director Cheran: కారును ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేసిన ప్రైవేటు బస్సు.. డ్రైవర్‌తో సినీ దర్శకుడు చేరన్ వాగ్వివాదం.. వీడియో ఇదిగో!

Tamil Dierctor Cheran Altercation With A Private Bus Driver
  • పుదుచ్చేరి నుంచి కడలూరు వెళ్తున్న బస్సు
  • ఎయిర్ హారన్ మోగిస్తూ భయభ్రాంతులకు గురిచేసిన డ్రైవర్
  • బస్సును ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించిన దర్శకుడు చేరన్
  • ఇలాంటి బస్సు డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరిన డైరెక్టర్
భయభ్రాంతులకు గురిచేసేలా హారన్ మోగిస్తూ తన కారును ఓవర్ టేక్ చేసిన ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌తో తమిళ సినీ దర్శకుడు, నటుడు చేరన్ వాగ్వివాదానికి దిగాడు. నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో పుదుచ్చేరి నుంచి కడలూరు వెళ్తున్న బస్సు.. ముందు వెళ్తున్న చేరన్ కారును ఓవర్ టేక్ చేస్తూ ఆగకుండా హారన్ మోగించాడు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన చేరన్ బస్సును ఓవర్ టేక్ చేసి దాని ముందు కారును ఆపాడు. 

పరిసరాలు దద్దరిల్లేలా ఉండే ఎయిర్ హారన్‌ను ఎందుకు మోగిస్తున్నావని డ్రైవర్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇది కాస్తా ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారితీసింది. దీంతో కలగజేసుకున్న కండక్టర్ ఇద్దరికి సర్దిచెప్పాడు. కడలూరు-పుదుచ్చేరి మధ్య రోజూ 150కి పైగా బస్సులు ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్ల మధ్య ఉండే పోటీ నేపథ్యంలో ఇవి అత్యంత వేగంగా, ప్రమాదకరంగా నడుస్తుంటాయి. ఇలా ప్రమాదకరంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ చేరన్ కోరాడు.
Director Cheran
Tamil Nadu
Private Bus
DMK

More Telugu News