PR Sreejesh: భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం

Hockey India Retires PR Sreejesh Iconic No 16 Jersey
  • అతడి జెర్సీ నెం.16ని రిటైర్ చేసిన హాకీ ఇండియా
  • జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా ఈ నిర్ణయం
  • పారిస్ ఒలింపిక్స్‌తోనే అంత‌ర్జాతీయ‌ కెరీర్ కు వీడ్కొలు ప‌లికిన‌ హాకీ లెజెండ్‌
భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం ద‌క్కింది. అతడి జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ బుధ‌వారం ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా, పారిస్‌ ఒలింపిక్స్ లో భార‌త జ‌ట్టు కాంస్యం సాధించడంలో గోల్ కీపర్ గా శ్రీజేశ్ కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. దీంతో టీమిండియా వ‌రుస‌గా రెండో ఒలింపిక్స్ మెడ‌ల్‌ను ముద్దాడింది. ఇక ఈ విశ్వ క్రీడలతోనే త‌న అంత‌ర్జాతీయ‌ కెరీర్ కు వీడ్కోలు ప‌లికాడు ఈ హాకీ లెజెండ్‌.

“పీఆర్ శ్రీజేశ్‌ ఉపయోగించిన నంబర్ 16 జెర్సీ ఇప్పుడు రిటైర్ అవుతుంది. ఇది సీనియర్ జట్టు కోసం తీసుకున్న నిర్ణ‌యం. జూనియర్ల‌ కోసం జెర్సీ ఉంటుంది. ఎందుకంటే శ్రీజేశ్‌ తదుపరి శ్రీజేశ్‌ను తీర్చిదిద్దాలని వారు కోరుకుంటున్నారు” అని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ అన్నారు.
PR Sreejesh
Hockey India
Paris Olympics

More Telugu News