Antony Blinken: భారత్‌కు అమెరికా స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

Happy Independence Day to Indians Says Antony Blinken
78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త ప్ర‌జ‌ల సంప‌న్న‌మైన, వైవిధ్య‌మైన చ‌రిత్ర‌ను గుర్తు చేసుకుంటూ ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని అమెరికా కూడా నిర్వ‌హించుకుంటోంద‌ని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. 

భార‌త్‌-అమెరికా మ‌ధ్య బ‌ల‌మైన బంధం ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల మ‌ధ్య ఉన్న సంబంధాల‌ను ఆయ‌న కొనియాడారు. మునుముందు కూడా ఈ బంధం ఇలాగే కొన‌సాగాల‌ని బ్లింకెన్ ఆకాంక్షించారు. ఈ ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా అమెరికా త‌ర‌ఫున భార‌త ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.
Antony Blinken
Happy Independence Day
USA
August 15

More Telugu News