Pawan Kalyan: బాధ్యతను గుర్తుచేసుకునే రోజు ఇది: పవన్ కల్యాణ్

AP Dy CM Pawan Kalyan At Kakinada Police Parade Grounds For Aug 15 celebrations

  • కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
  • పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించిన పవన్

వేలాది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్ర్యం ఈరోజు వేడుకగా జరుపుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే, వేడుకలు జరుపుకుని ఆనందించడం సరిపోదని, ప్రతీ ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకోవాల్సిన రోజు ఇది అని చెప్పుకొచ్చారు. ఈమేరకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. అలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర్య యోదులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు.


  • Loading...

More Telugu News