Jana Gana Mana: ఠాగూర్ దస్తూరీతో ఉన్న 'జన గణ మన' ఆంగ్ల అనువాద ప్రతిని పంచుకున్న నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు
భారతదేశం నేడు 78వ స్వాంతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి భావనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రఖ్యాత నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. భారత జాతీయ గీతం 'జన గణ మన' ఆంగ్ల అనువాద ప్రతిని పంచుకున్నారు. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదస్తూరీతో ఉందని వెల్లడించారు.
"జన గణ మన అనేది భారత జాతీయ గీతం. కవి రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని బెంగాలీ భాషలో రచించారు. ఆయనకు 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది" అంటూ నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు ట్వీట్ లో పేర్కొన్నారు.