Kangana Ranaut: తనపై వస్తున్న పుకార్లపై తొలిసారి స్పందించిన కంగనా రనౌత్

Kangana Ranaut respons on rumours on her acting career
  • బీజేపీ తరపున ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్
  • నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారంటూ ప్రచారం
  • ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న కంగన
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పార్లమెంటు ఎన్నికల్లో లోక్ సభ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మరోవైపు, ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో... నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ పుకార్లపై కంగన తొలిసారి స్పందించారు. 

తాను నటిగా కొనసాగాలా? వద్దా? అనేది సినీ ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కంగన తెలిపారు. రాజకీయాల్లోకి వస్తానని తాను కలలో కూడా ఊహించలేదని... కానీ, ప్రజలు తనను గెలిపించి, పార్లమెంటుకు పంపించారని చెప్పారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేశాననే విషయాన్ని పక్కన పెడదామని... తాను ఎన్నికల్లో పోటీ చేయాలని మాత్రం ప్రజలు బలంగా కోరుకున్నారని తెలిపారు. 

తన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' విజయాన్ని సాధిస్తే... తాను ఇండస్ట్రీలో కొనసాగుతానని కంగన తెలిపారు. రాజకీయాల్లో తన అవసరం ఎక్కువగా ఉందని అనిపిస్తే... పాలిటిక్స్ లో కొనసాగుతానని చెప్పారు. మన అవసరం ఎక్కడ ఉంటుందో, మనకు ఎక్కడ గౌరవం ఉంటుందో... మనం అక్కడే ఉండాలని అన్నారు. సినిమాలా? రాజకీయాలా? అనే విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
Kangana Ranaut
BJP
Bollywood

More Telugu News