Mark Zuckerberg: అర్ధాంగికి అపురూప కానుకనిచ్చిన జుకర్ బర్గ్

Zuckerberg gave an incredible gift to Ardhaangi

  • రోమన్ సంప్రదాయంలో ప్రిన్సిల్లా చాను శిల్పాన్ని చెక్కించి గిఫ్ట్ గా ఇచ్చిన జుకర్ బర్గ్
  • సోషల్ మీడియాలో ఫోటోల వైరల్

సహజంగా ప్రతి ఒక్కరూ తన ప్రియురాలికి లేదా భార్యకు జీవితాంతం గుర్తుండిపోయేలా అపురూపమైన బహుమతి (గిఫ్ట్) ఇవ్వాలని భావిస్తుంటారు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకూ వారి వారి స్థాయిలో బహుమతిని అందిస్తూ ఉంటారు. అదే కోవలో ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన అర్ధాంగి ప్రిన్సిల్లా చానుకు వినూత్నమైన బహుమతి అందించి తన ప్రేమను చాటుకున్నారు. తన అర్ధాంగికి జీవితాంతం గుర్తిండిపోయేటటువంటి బహుమతి అందించారు.
 
అది ఏమిటంటే .. రోమన్ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి కానుకగా ఇచ్చారు. ఆ శిల్పాన్ని వారి ఇంటి పెరటిలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తన శిల్పం వద్ద ప్రిన్సిల్లా కాఫీ సేవిస్తూ ఫోటోలకు పోజు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్షలాది మంది ఫాలోవర్స్ లైక్ లు ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విగ్రహాన్ని న్యూయార్క్ నగరానికి చెందిన ప్రసిద్ధ కళాకారుడు డేనియల్ ఆర్షమ్ రూపొందించినట్లు తెలిసింది.
 
కాగా, జుకర్ బర్గ్ – ప్రిన్సిల్లాది లవ్ మ్యారేజ్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వీరు డేటింగ్ లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని దంపతులుగా మారారు. వీరికి ముగ్గురు సంతానం.

View this post on Instagram

A post shared by Mark Zuckerberg (@zuck)

  • Loading...

More Telugu News