HYDRA: హ‌డ‌లెత్తిస్తున్న 'హైడ్రా'.. సంస్థ‌పై కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల క‌న్నెర్ర‌!

Some Political Leaders are Angry with The Hydra

  • న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ తొల‌గింపు
  • ఇప్ప‌టికే 100 ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల స్వాధీనం
  • సంస్థ‌పై ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, మొహ్మ‌ద్ ముబీన్ గుర్రు
  • ఈ సంస్థ‌ను ర‌ద్దు చేయాలంటూ ప్ర‌జాప్ర‌తినిధుల డిమాండ్‌
  • హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌పై మాజీ ఐఏఎస్‌ ఆకునూరి ముర‌ళీ ప్ర‌శంస‌

ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డంతో పాటు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌గ‌రానికి అండ‌గా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) ను తీసుకువ‌చ్చారు. ఇప్పుడీ సంస్థ క‌బ్జాదారుల‌ను వ‌ణికిస్తోంది. 

న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం చేస్తోంది. దీంతో కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు దీనిపై క‌న్నెర్ర చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంస్థ‌ను ర‌ద్దు చేయాలంటూ కొంత‌మంది స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు సైతం డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో ఇప్పుడు ఈ సంస్థ‌పై సీఎం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది స‌స్పెన్స్‌గా మారింది. 

నెల కింద హైడ్రా ఏర్పాటు.. ఇప్ప‌టికే 100 ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల స్వాధీనం
సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగ‌నాథ్ చీఫ్‌గా సుమారు 3వేల మంది అధికారులు, సిబ్బందితో నెల కింద‌ట హైడ్రా ఏర్పాటైంది. ఇప్ప‌టికే సుమారు 20 చెరువుల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. అలాగే సుమారు 100 ఎక‌రాలకు పైగా ప్ర‌భుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. ఇలా ఏర్పాటైన నెల రోజుల వ్య‌వ‌ధిలోనే త‌న ఉనికి చాటుకుందీ సంస్థ‌. 

జూబ్లీహిల్స్ లోని నంద‌గిరి హిల్స్ వివాదం.. ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఫైర్‌
జూబ్లీహిల్స్ లోని నంద‌గిరి హిల్స్ లో 2వేల గ‌జాల పార్కు స్థ‌లంలో గురుబ్ర‌హ్మ వాసులు గుడిసెలు నిర్మించుకున్నారు. వాటిని తొల‌గించిన హైడ్రా.. ప్ర‌హ‌రీని నిర్మించింది. ఈ విష‌యం ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు ప్ర‌హ‌రీ గోడ‌ను కూల్చేశారు. దాంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు కావ‌డం జ‌రిగింది. ఈ విష‌య‌మై క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. సీఎంకు ఫిర్యాదు చేస్తాన‌ని కూడా చెప్పారు. 

ఇక‌ ఓల్డ్‌సీటీలోని శాస్త్రీపురం బంరుక్‌నుద్దౌల చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూడా హైడ్రా తొల‌గించింది. ఆ స‌మయంలో కూడా బ‌హ‌దూర్‌పుర ఎమ్మెల్యే మొహ్మ‌ద్ ముబీన్‌తో పాటు మ‌రికొంద‌రు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు అడ్డుకున్నారు. దాంతో వారిని అరెస్ట్ చేయించి మ‌రీ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది హైడ్రా. దాంతో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ఏకంగా హైడ్రాను ర‌ద్దు చేయాల‌ని న‌గ‌ర మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

బాచుప‌ల్లిలో ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా కొర‌డా 
బాచుప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ప్ర‌గ‌తి న‌గ‌ర్ ప‌రిధిలోని 134 స‌ర్వే నంబ‌రులో 3.03 ఎక‌రాల్లో విస్త‌రించిన ఎర్ర‌కుంట‌లో నిర్మిస్తున్న మూడు బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల‌ను గురువారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. మ్యాప్స్ ఇన్‌ఫ్రా అనే నిర్మాణ సంస్థ 360 చద‌ర‌పు అడుగుల విస్తీర్ణం చొప్పున మూడు వేర్వేరు బ్లాకుల భ‌వ‌నాలను నిర్మించేందుకు గ‌తంలోనే హెచ్ఎండీఏ నుంచి అనుమ‌తి పొందిన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ భూములు ఎర్రకుంట‌కు చెందిన ఎఫ్టీఎల్‌, బ‌ఫ‌ర్ భూముల ప‌రిధిలోకి వ‌స్తాయి. కానీ, దొడ్డిదారిన అనుమ‌తులు పొంది ఇలా నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై బీజేపీ నేత ఆకుల స‌తీశ్ ఆధ్వ‌ర్యంలో స్థానికులు ప‌లుమార్లు అధికారుల తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ఎర్ర‌కుంట‌ను సంద‌ర్శించ‌డం, ఆయ‌న వెళ్లిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే భారీ బందోబ‌స్తు మ‌ధ్య నిర్మాణాల‌ను కూల్చివేత‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. 

'ఎక్స్' వేదిక‌గా రంగ‌నాథ్‌ను మెచ్చుకున్న ఆకునూరి ముర‌ళీ
మాజీ ఐఏఎస్ ఆకునూరి ముర‌ళీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్‌ను మంచి ప‌ని చేస్తున్నారంటూ ప్ర‌శంసించారు. ప్ర‌జాప్ర‌తినిధులు ఇష్టానుసారంగా ప్ర‌భుత్వ, చెరువు భూముల‌ను ఆక్ర‌మిస్తున్నారని, ముఖ్య‌మంత్రి హైడ్రాను మ‌రింత బ‌లోపేతం చేసి రాష్ట్ర‌మంత విస్త‌రించాల‌ని, రంగ‌నాథ్‌కి పూర్తి స‌హ‌కారం అందించాల‌న్నారు. చెరువులు, ల‌క్ష‌ల కోట్ల భూముల‌ను కాపాడి భావిత‌రాల‌కు మంచి ప‌ర్యావ‌ర‌ణాన్ని అందించాల‌ని ఆకునూరి ముర‌ళీ కోరారు.

  • Loading...

More Telugu News