Etela Rajender: రేవంత్ రెడ్డి విలీనం వ్యాఖ్యలపై స్పందించిన ఈటల రాజేందర్

Etala responds on merger comments of revanth reddy

  • సీఎం చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని... అదంతా ఊహాజనితమేనని వెల్లడి
  • కాంగ్రెస్ పార్టీ కావాలని తమపై విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • సీఎం చెప్పినట్లుగా విలీనం జరగదన్న ఈటల రాజేందర్

బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా ఊహాజనితమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలని విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా విలీనం జరగదని... తమ పార్టీలో అలాంటి చర్చే లేదన్నారు.

రుణమాఫీ జరిగిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కూడా ఈటల రాజేందర్ స్పందించారు. రుణమాఫీ పూర్తిగా జరిగిందని చెబుతున్నారని, అదంతా బోగస్ అన్నారు. రుణమాఫీ రూ.72 వేల కోట్లు ఉండగా, విధివిధానాల పేరుతో రూ.34 వేల కోట్లకు తగ్గించారని ఆరోపించారు. అవి కూడా పూర్తిగా చేయలేదన్నారు. హైడ్రా పేరుతో జరుగుతోన్న హైడ్రామాను ఆపాలని సూచించారు. అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలని సూచించారు.

  • Loading...

More Telugu News