Polavaram Files: పోలవరం ఎడమ కాలువ ఫైళ్లు దగ్ధం కాలేదు: ఆర్డీవో
- పోలవరం ఫైళ్లు దగ్ధం అంటూ మీడియాలో కథనాలు
- స్పందించిన ఆర్డీవో శివజ్యోతి
- సంతకాలు లేని పత్రాలు, జిరాక్స్ కాపీలు దహనం చేశారని వెల్లడి
- ఈ పత్రాలు ఏమంత ముఖ్యమైనవి కావని వివరణ
- అనుమతి లేకుండా దహనం చేయడంపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువకు సంబంధించిన ఫైళ్లు దవళేశ్వరంలోని పరిపాలన కార్యాలయం వద్ద దగ్ధం అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి. దీనిపై ఆర్డీవో శివజ్యోతి స్పందించారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం కాలేదని స్పష్టం చేశారు.
సంతకాలు లేని పత్రాలు, జిరాక్స్ పేపర్లను మాత్రమే దహనం చేశారని వెల్లడించారు. అనుమతి లేకుండా ఎందుకు దహనం చేశారో విచారణ చేస్తామని ఆర్డీవో అన్నారు. శాఖాధిపతి సంతకాలు లేవు కాబట్టి, ఆ పత్రాలు ఏమంత ముఖ్యమైనవి కావని పేర్కొన్నారు.
ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి కొత్త బీరువాలు వచ్చాయని, ఫైళ్లు సర్దే క్రమంలో అవసరం లేని వాటిని కాల్చారని ఆర్డీవో శివజ్యోతి వివరించారు. అయితే, అనుమతి లేకుండా ఫైళ్లు దహనం చేయడంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.