Nimmala Rama Naidu: ఇవాళ సిగ్గులేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు: మంత్రి నిమ్మల

Nimmla slams YCP leaders on Polavaram issue

  • ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో నిమ్మల ప్రెస్ మీట్
  • వైసీపీ నేతలపై ఫైర్
  • ఐదేళ్లు అధికారంలో ఉండి 'పోలవరం'ను గోదావరిలో ముంచేశారని విమర్శలు
  • జగన్ ఫేక్ స్వభావాన్ని బయటపెట్టుకున్నాడని వ్యాఖ్యలు

ఢిల్లీ ఆంధ్ర భవన్ లో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు  మీడియాతో మాట్లాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం చంద్రబాబుతో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశంలో నిమ్మల కూడా పాల్గొన్నారు. 

ఇవాళ ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఐదేళ్లు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేసినోళ్లు సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు. తమ అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకోవడానికే సమర్థవంతమైన నేటి పాలనపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారు. 

పోలవరం గురించి వైసీపీ మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది. 2020 ఆగస్టులో వచ్చిన వరదల సమయానికి ఎగువ కాపర్ డ్యాం దెబ్బతిన్నదని  హైదరాబాద్ ఐఐటీ నిపుణులు  చెప్పిన మాట వాస్తవం కాదా? 

2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు పనిచేసిన ఏజెన్సీ లేకపోవడమే డయాఫ్రమ్ వాల్  దెబ్బ తినడానికి కారణమని ఐఐటీ నిపుణులు చెప్పలేదా? 2019 మే నెల నుండి రెండు నెలల్లో పూర్తి కావాల్సిన కాఫర్ డ్యాంను 13 నెలలైనా పూర్తి చేయకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి గురైందని ఐఐటీ నిపుణులు చెప్పలేదా? 

క్లిష్టతరమైన ప్రాజెక్టులలో ఏజెన్సీలను మార్చవద్దని పీపీఏ హెచ్చరిస్తూ లేఖ రాయలేదా? ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తే పోలవరం డ్యాంకు ప్రమాదం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని పీపీఏ మినిట్స్ లో మిమ్మల్ని హెచ్చరించిన మాట వాస్తవం కాదా? 

తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకు రూ.11,762 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు   6,764 కోట్లు మాత్రమే. జగన్ ప్రభుత్వంలో పోలవరంకు రూ.4,167 కోట్లు ఖర్చు పెట్టగా... కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8,382 కోట్లు. 

ఖర్చు పెట్టిన దానికంటే కేంద్రం నుంచి అధికంగా వచ్చిన రూ.3,385 కోట్లు పోలవరం నిధులను దారి మళ్లించిన మీకు పోలవరం గురించి మాట్లాడడానికి అర్హత లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కోసం చూడకుండా... ఎదురు ఖర్చు పెట్టింది టీడీపీ ప్రభుత్వం. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం దారి మళ్లించిన జగన్ కు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? నిపుణుల కమిటీ తుది నివేదిక ఇవ్వకుండానే  డ్రాఫ్ట్ ను ఎడిట్ చేసి తన ఫేక్ స్వభావాన్ని జగన్ మరోసారి బయట పెట్టాడు" అంటూ మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News