Abhishek Manu Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా మనుసింఘ్వీ... సీఎల్పీ తీర్మానం

CLP Resolution after Congress high command confirms Abhishek Manu Singhvi
  • గచ్చిబౌలిలోని హోటల్ షెరాటన్ లో సీఎల్పీ సమావేశం
  • హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అభిషేక్ మనుసింఘ్వీ
  • రేపు నామినేషన్ దాఖలు చేయనున్న మనుసింఘ్వీ
తెలంగాణ కోటాలో రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ గచ్చిబౌలిలోని హోటల్ షెరాటన్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, క్యాబినెట్ మంత్రులు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.

మనుసింఘ్వీ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేటి సీఎల్పీ భేటీలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో, మనుసింఘ్వీ సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ  సీఎల్పీ సమావేశం సందర్భంగా రేవంత్ రెడ్డి... మనుసింఘ్వీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Abhishek Manu Singhvi
Rajya Sabha
CLP
Congress
Telangana

More Telugu News