Chiranjeevi: తన తండ్రి బ్లాక్ అండ్ వైట్ ఫొటో పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi shared his father pic on World Photography Day
  • ఇవాళ వరల్డ్ ఫొటోగ్రఫీ డే
  • ఆసక్తికర ఫోటో పంచుకున్న చిరంజీవి
  • అప్పట్లో తన తండ్రి హీరోలా ఉండేవాడని వెల్లడి
ఇవాళ వరల్డ్ ఫొటోగ్రఫీ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. అది చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు ఫొటో. 

"బ్లాక్ అండ్ వైట్ కాలంలో అది నేను తీసిన ఫొటోనే. అప్పట్లో మా నాన్న హీరోలా ఉండేవాడు. ఆయనను ఫొటో తీయడానికి నా ఆగ్ఫా కెమెరా కూడా ఎంతో ముచ్చటపడేది. కాలంలో ప్రయాణించేందుకు ఫొటోలు టైమ్ మెషీన్లలా ఉపయోగడపతాయి" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఆ ఫొటోలో కొణిదెల వెంకట్రావు ప్యాంటు, షర్టు ధరించి, కళ్లజోడు పెట్టుకుని, సైకిల్ పై స్వారీకి సిద్ధమవుతుండడాన్ని చూడొచ్చు.
Chiranjeevi
Konidela Venkatrao
World Photography Day
Black and White
Tollywood

More Telugu News