maruthinagar subramanyam: 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్టుగా అల్లు అర్జున్

allu arjun to grace to pree release event of marutinagar subramanyam
  • మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ ఆగస్టు 23న విడుదల
  • ఆగస్టు 21న హైదరాబాద్ లో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ 
  • మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
రావు రమేశ్ కథానాయకుడిగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “మారుతీ నగర్ సుబ్రమణ్యం”. పిబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమా టిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించగా, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్థన్ కీలక పాత్రలో నటించారు.

సుకుమార్ భార్య తబిత సమర్పణలో వస్తున్న ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ మూవీ ఆగస్టు 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆగస్టు 21న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హజరవుతున్నారు. 

ఇక ఈ సినిమాలో రావు రమేశ్, అంకిత్ కొయ్య తండ్రీ తనయుల పాత్రలు పోషించారు. రమేశ్ తన తండ్రి కాదనీ, తాను అల్లు అర్జున్ కుటుంబంలో జన్మించాననీ, అల్లు అరవింద్ తన తండ్రి – అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకునే క్యారెక్టర్ ను అంకిత్ కొయ్య చేశారు. ప్రేమించిన యువతిని ఊహించుకుంటూ పాడుకునే పాట్లలోనూ అల్లు అర్జున్ మూవీల్లో సూపర్ హిట్ పాటలను రీ క్రియేషన్ చేశారు. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కల్యాణ్ చక్రవర్తి పాటలు రాశారు. 
maruthinagar subramanyam
Laksman karya
icon star allu arjun

More Telugu News