TTD: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదిగో!

TTDs gearing up for srivari navahnika salakatla brahmotsavams

  • తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్టోబర్ 4 నుండి 12వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • అక్టోబర్ 3 సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ వెల్లడి
  • ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాహన సేవలు

తిరులమ శ్రీ వారి ఆలయంలో వైభవంగా జరిగే నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ సోమవారం విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకూ, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకూ వాహన సేవలు నిర్వహిస్తారు. 

వాహన సేవల వివరాలు ఇలా..

4-10-2024 – సాయంత్రం 5.45 గంటల నుండి 6 గంటల వరకూ ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం 
5-10.2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
6-10.2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
7-10.2024 – ఉదయం 8 గంటలకు కల్ప వృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం.
8-10.2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకూ గరుడ వాహనం. 
9-10.2024 – ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుండి స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం
10-10.2024 – ఉదయం 8 గంటలకు సూర్య ప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.
11-10.2024 – ఉదయం 7 గంటలకు రధోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం.
12-10.2024 – ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకూ చక్ర స్నానం, రాత్రి 8.30 గంటల నుండి 10.30 గంటల వరకూ ధ్వజావరోహణం

  • Loading...

More Telugu News