KTR: మేఘా సంస్థపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో!:కేటీఆర్

KTR Comments on cm revanth over Megha engineering company
  • మేఘా సంస్థకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్న కేటిఆర్  
  • తెలంగాణ సంపదను దోచుకువెళుతున్న కంపెనీగా అభివర్ణించిన రేవంత్ ఇప్పుడు ప్రేమ ఎందుకు చూపిస్తున్నారని వ్యాఖ్య
  • మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నా సీఎం పట్టించుకోలేదన్న కేటీఆర్
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్దం జరుగుతూనే ఉంది. తాజాగా రేవంత్ సర్కార్ రూ.4350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించనుందని వార్తలు రావడంతో.. బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన ఆ సంస్థకు ఆ పనులు ఎలా అప్పగిస్తారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.  
 
సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటిఆర్ పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపదను దోచుకువెళుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు మేఘా సంస్థపై రేవంత్ రెడ్డి ఎందుకింత ప్రేమ, ఔదార్యం చూపిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR
Revanth Reddy
megha company

More Telugu News