Jio: సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా 800 చానళ్లు
- టీవీ ప్లస్ సేవలను విస్తృతం చేసిన జియో
- అన్ని స్మార్ట్ టీవీ ఫ్లాట్ ఫామ్స్ లో కూడా జియో టీవీ ప్లస్ సేవలు
సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా వినియోగదారులు 800 చానళ్లు చూసే అవకాశం కల్పిస్తొంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. జియో తన టీవీ ప్లస్ సేవలను విస్తృతం చేసింది. ఇటీవలి వరకూ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు సెట్ టాప్ బాక్స్ లో ఈ యాప్ అందుబాటులో ఉండేది. అయితే ఇకపై ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఓస్ లోనూ జియో టీవీ ప్లస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సబ్ స్రైబర్ లు సింగిల్ లాగిన్ తో 800 డిజిటల్ ఛానెళ్లు వీక్షించవచ్చు. ఈ మేరకు జియో ఓ ప్రకటన విడుదల చేసింది.
దాదాపుగా అన్ని స్మార్ట్ టీవీ ఫ్లాట్ ఫామ్స్ లో కూడా జియో టీవీ ప్లస్ సేవలు లభిస్తాయి. న్యూస్ ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్ విభాగాలకు చెందిన ఛానెళ్లు చూడవచ్చు. జియో సినిమా ప్రీమియం, డిస్నీ ప్లస్, హాట్ స్టార్, సోనీ లివ్, జీ 5 వంటి ఓటీటీ యాప్స్ ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఇందు కోసం అండ్రాయిడ్ టీవీల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి జియో టీవీ ప్లస్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్ స్రైబర్ లు ఈ యాప్ ద్వారా కంటెంట్ ను చూడవచ్చు. అయితే శాంసంగ్ స్మార్ట్ టీవీ యూజర్లు ఈ యాప్ ను వినియోగించుకోలేరు. అలాంటి వారు మాత్రం సెట్ టాప్ బాక్స్ ను కొనుగోలు చేయాలి. ఈ మేరకు జియో ప్రకటనలో తెలిపింది.