Rishab Shetty: బాలీవుడ్‌పై రిషబ్‌ శెట్టి వివాదాస్పద కామెంట్స్‌.. ఫ్యాన్స్ ఫైర్‌!

Rishab Shetty Controversy Comments on Bollywood
కన్నడ న‌టుడు, కాంతార ఫేమ్ రిషబ్‌ శెట్టి తాజాగా బాలీవుడ్‌పై వివాదాస్పద కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలిచారు. బాలీవుడ్ సినిమాలు భార‌త్‌ను చెడుగా చూపిస్తుంటాయ‌ని అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందని తెలిపారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయ‌న విమ‌ర్శ‌ల ప‌ట్ల బాలీవుడ్ అభిమానులు మండిప‌డుతున్నారు. 

కొందరు రిష‌బ్ శెట్టిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో ఆయ‌న‌ నటించిన కొన్ని సినిమాల్లోని సీన్ల‌ను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జాతీయ సినిమా అవార్డుల్లో కాంతార మూవీకి గాను రిష‌బ్ శెట్టి జాతీయ‌ ఉత్త‌మ న‌టుడిగా ఎంపికైన విష‌యం తెలిసిందే.
Rishab Shetty
Bollywood

More Telugu News