Rajesh Nambiar: కాగ్నిజెంట్ సీఎండీ పదవికి రాజీనామా చేయనున్న రాజేశ్ నంబియార్... ఎందుకంటే...!

Rajesh Nambiar will resign as Cognizant india CMD in September
  • నాస్కామ్ తదుపరి అధ్యక్షుడిగా రాజేశ్ నంబియార్
  • ప్రస్తుతం నాస్కామ్ అధ్యక్షురాలిగా ఉన్న దేబ్జాని ఘోష్
  • నవంబరులో పదవీవిరమణ చేయనున్న ఘోష్
ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజేశ్ నంబియార్ రాజీనామా చేయనున్నారు. రాజేశ్ నంబియార్ నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ) తదుపరి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

నాస్కామ్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో, ఆయన కాగ్నిజెంట్ సీఎండీ పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం నాస్కామ్ అధ్యక్షురాలిగా దేబ్జాని ఘోష్ వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీకాలం ఈ ఏడాది నవంబరుతో ముగియనుంది. అనంతరం నాస్కామ్ కొత్త అధ్యక్షుడిగా రాజేశ్ నంబియార్ పగ్గాలు అందుకుంటారు. ఆయన సెప్టెంబరు చివరలో కాగ్నిజెంట్ సీఎండీ పదవికి రాజీనామా చేయనున్నారు. 

ఐటీ రంగంలో రాజేశ్ నంబియార్ కు ఘన చరిత్ర ఉంది. గతంలో ఆయన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), ఐబీఎం, సియెనా వంటి దిగ్గజ సంస్థలకు సేవలు అందించారు.
Rajesh Nambiar
CMD
Cognizant
NASSCOM
President
India

More Telugu News