Whatsapp: అదిరిపోయే ఫీచర్‌ను తీసుకువచ్చిన వాట్సాప్!

whatsapp introduces voice note transcripts for android users
  • వాట్సాప్ నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్
  • వాయిస్ మెసేజ్‌లను ఇక చదువుకోవచ్చు
  • వాట్సాప్ అప్‌డేట్ చేసి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు
వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయేందుకు దీనిపై ఆధారపడుతున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మెసేజింగ్ యాప్ .. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్ తీసుకొస్తోంది. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చింది. 
 
కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేయడానికి వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. వాయిస్ నోట్ ట్రాన్స్‌స్క్రిప్ట్. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇకపై వారికొచ్చిన వాయిస్ మెసేజ్‌ను చదువుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు  ఈ సులభమైన కొత్త ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి  తాజా వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
తొలుత వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్ వాట్సాప్ తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకుని సెట్టింగ్ మెనులో వాయిస్ నోట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
Whatsapp
Messaging App
Android
Google Play Store

More Telugu News