Road Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా .. 30 మందికి గాయాలు

private travel bus overturned in nalgonda dist
  • నల్గొండ జిల్లాలో అద్దంకి – నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద ఘటన 
  • క్రేన్ సాయంతో ప్రయాణికులను బయటకు తీసిన పోలీసులు
  • మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి దర్శి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

క్రేన్ సాయంతో పోలీసులు ప్రయాణీకులను బయటకు తీశారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వస్తున్న బస్సు బోల్తా కొట్టినా ప్రాణాపాయం లేకుండా స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 
Road Accident
Nalgonda District

More Telugu News