Israel: హెజ్బొల్లా టార్గెట్ గా లెబనాన్ పై రాకెట్ల వర్షం కురిపించిన ఇజ్రాయెల్

Israel launches airstrikes on Lebanon in self defence
  • వంద ఫైటర్ జెట్లతో లెబనాన్ లోకి చొచ్చుకెళ్లి మరీ దాడి
  • రాకెట్ లాంఛర్ బారెల్స్ ద్వంసం
  • ఇజ్రాయెల్ పైకి 320 క్షిపణులు ప్రయోగించిన హెజ్బొల్లా
లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. వంద ఫైటర్ జెట్లతో రాకెట్ల వర్షం కురిపించింది. లెబనాన్ లోని హెజ్బొల్లా రాకెట్ లాంఛర్ బారెల్స్ ను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్‌ మీడియా వెల్లడించింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ పైకి 320 క్షిపణులను ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. అయితే, ఈ క్షిపణులను తాము మధ్యలోనే కూల్చేశామని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. దీనిపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. తమపై దాడి చేస్తే రెట్టింపు స్థాయిలో ప్రతిదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, హెజ్బొల్లా దాడుల నేపథ్యంలో దేశంలో 48 గంటల ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ ప్రకటించారు. మరోవైపు, కైరోలో బంధీల విడుదలకు సంబంధించి నిఘా సంస్థల ప్రతినిధులు మొసాద్, షిన్ బెట్ చీఫ్ లు చర్చలకు వెళ్లారు. 

ఫాద్ షుక్రు హత్యకు ప్రతీకారం..
తమ నేత ఫాద్ షుక్రు హత్యకు ప్రతీకారంగా తొలివిడత దాడిని మొదలుపెట్టినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ లోని 11 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించినట్లు వివరించింది. కాగా, సైనిక శిక్షణ, ఆయుధ సరఫరా విషయంలో హెజ్బొల్లాకు ఇరాన్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. సిరియా పాలకులు కూడా హెజ్బొల్లాకు అండగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. 2022 లో జరిగిన లెబనాన్ పార్లమెంట్ ఎన్నికల్లో హెజ్బొల్లా సంస్థ 13 సీట్లు గెలుచుకుంది. అయితే, హెజ్బొల్లాను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
Israel
Israel-Hezbollah
Conflict
Middle East
100 Fiter jets
lebanon

More Telugu News