Palaparti David Raju: మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి... మంత్రి గొట్టిపాటి స్పందన
- డేవిడ్ రాజు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్న గొట్టిపాటి
- జడ్పీ చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని వెల్లడి
- డేవిడ్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైనం
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. డేవిడ్ రాజు మృతి పట్ల ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలియజేశారు. పాలపర్తి డేవిడ్ రాజు హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. డేవిడ్ రాజు జడ్పీ చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని వెల్లడించారు. ఈ విషాద సమయంలో డేవిడ్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
పాలపర్తి డేవిడ్ రాజు 1999లో టీడీపీ తరఫున ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ పార్టీ ఏర్పడ్డాక ఆ పార్టీలో చేరారు. తిరిగి 2017లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో డేవిడ్ రాజు మళ్లీ వైసీపీలో చేరారు. వైసీపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన పలుమార్లు చంద్రబాబును కలిసినప్పటికీ మళ్లీ టీడీపీలోకి రాలేకపోయారు.