Prashant Kishor: జీడీపీ అంటే తెలియని తేజస్వి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది: ప్రశాంత్ కిషోర్

Prashant Kishor attacks Tejashwi Yadav

  • అప్పుడు స్విట్జర్లాండ్‌లా కనిపించిన బీహార్ ఇప్పుడు హీనంగా కనిపిస్తోందా? అని ప్రశ్న
  • నితీశ్ మళ్లీ మహా ఘట్‌బంధన్‌లో చేరితే అద్భుతంగా కనిపిస్తుందేమోనని ఎద్దేవా
  • అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడి

జీడీపీ అంటే తెలియని తేజస్వీ యాదవ్ బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కులం, దోపిడీ, మద్యం, మాఫియా, నేరాల గురించి తేజస్వి మాట్లాడితే ఏమైనా అనడానికి వీలుంటుందని, కానీ వాటికి బదులు అభివృద్ధి నమూనా గురించి మాట్లాడితే నవ్వు వస్తోందన్నారు. 

గత పదిహేనేళ్లుగా వారు అధికారంలో ఉన్నారని, కానీ తేజస్వికి మాత్రం జీడీపీ అంటే తెలియదన్నారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్విట్జర్లాండ్‌లా కనిపించిన బీహార్ ఇప్పుడు హీనస్థితిలో కనిపిస్తోందా? అని ధ్వజమెత్తారు. 

నితీశ్ కుమార్ తిరిగి మహా ఘట్‌బంధన్‌లో చేరితే మళ్లీ రాష్ట్రం అద్భుతంగా కనిపిస్తుందేమోనని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు.

  • Loading...

More Telugu News