BJP: ఆమెకు ఆ అధికారం లేదు!: కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్

BJP On Kangana Ranaut Farmers Protest Remarks
  • నాటి రైతుల నిరసన వెనుక విదేశీ కుట్ర ఉందన్న కంగనా రనౌత్
  • ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ
  • భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని సూచన
రైతుల నిరసనపై వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌కు బీజేపీ షాకిచ్చింది. నాటి రైతుల నిరసన వెనుక విదేశీ కుట్ర ఉందని కంగన సంచలన ఆరోపణలు చేశారు. కంగన వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. పార్టీ విధానంపై ప్రకటన చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. కంగన వ్యాఖ్యలకు తాము బాధ్యత వహించబోమని తేల్చి చెప్పింది.

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై నాడు రైతులు నిరసన తెలిపారు. రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసింది. నాటి రైతుల నిరసనను ఉద్దేశిస్తూ కంగన సంచల వ్యాఖ్యలు చేశారు.

రైతుల నిరసనతో దేశంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందని, కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ఆ నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉందని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకుంటే బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారి తీసేందన్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కంగనకు పార్టీ విధానంపై మాట్లాడే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి ప్రకటనలకు ఆమెకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొంది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించామని తెలిపింది.
BJP
Kangana Ranaut
India

More Telugu News