iPhone 16: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 16 విడుదల తేదీ ఖరారు!
- సెప్టెంబర్ 9న యాపిల్ 16 ఈవెంట్ నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటన
- యాపిల్ 16 ఫోన్లు విడుదల చేయనున్న టెక్ దిగ్గజం
- కీలకమైన సాఫ్ట్వేర్ అప్డేట్స్, కొత్త యాపిల్ వాచ్‌ను రిలీజ్ చేయనున్న కంపెనీ
ఐఫోన్ ప్రియులకు, టెక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్-16 విడుదల తేదీకి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 9న యాపిల్ 16 ఈవెంట్ నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కాలిఫోర్నియాలో కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ‘యాపిల్ ‘ఇట్స్ గ్లో టైమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో మీడియాకు ఆహ్వానాలు పంపింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఈవెంట్లో ఐఫోన్16 ఫోన్లను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. యాపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఏఐ-ఆధారిత యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఐవోఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వియా, వాచ్ ఓఎస్ 11తో పాటు ఇతర ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు ప్రకటించిన తర్వాత యాపిల్ 16 ఫోన్లు విడుదల కానున్నాయి. అయితే ఈ ఏడాది హార్డ్‌వేర్ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. హార్డ్‌వేర్ అప్డేట్స్లో ఐఫోన్ చిప్సెట్ అప్‌గ్రేడ్ ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లు ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేసేలా ఈ మార్పు ఉండవచ్చని కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మాత్రమే అవసరమైన ప్రాసెసింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి.
ఇక యాపిల్ 16 మోడల్ ఫోన్ల విషయానికి వస్తే.. స్క్రీన్ పరిమాణాలు కొద్దిగా పెరగవచ్చు. ఐఫోన్ 16 బేసిక్ మోడల్లో కెమెరా అమరిక వరుసను కూడా మార్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చతురస్రం లేఅవుట్లో ఉండగా కొత్త మోడల్లో నిలువు అమరికతో వచ్చే ఛాన్స్ ఉంది. కెమెరా అప్గ్రేడ్లు కూడా ఉండొచ్చు. జూమ్ కంట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా బటన్ ఇచ్చే అవకాశాలున్నాయి.
ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఈవెంట్లో కొత్త ఆపిల్ వాచ్ మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. మెరుగైన పనితీరు, అధిక శక్తి సామర్థ్యం ఉన్న కొత్త చిప్‌తో ఆపిల్ వాచ్ సిరీస్ 10ను (సిరీస్ X) విడుదల చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. పెద్ద స్క్రీన్‌ని అందించనుంది. కాగా ఐవోఎస్ 18.1 అప్డేట్ను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్టు యాపిల్ కంపెనీ తెలిపింది. కాగా మరో టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవలే పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో యాపిల్16 ఫోన్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.