ap govt: ఇకపై ఏపీ ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులోకి

goir web portal reinstated in ap

  • ఆగస్టు 29 నుండి జీవోఐఆర్ వెబ్ సైట్ పునరుద్ధరణ
  • ప్రభుత్వ శాఖలు అన్ని ఉత్తర్వులను జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశాలు 
  • గత వైసీపీ హయాంలో జీవోఐఆర్ వెబ్ పోర్టల్ నిలుపుదల

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జీవోలు (ఉత్తర్వులు) తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోఐఆర్ వెబ్ సైట్ ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి ప్రభుత్వ శాఖలు అన్ని ఉత్తర్వులను జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 29 నుండి అన్ని శాఖల జీవోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని తెలిపింది. 
 
2021 ఆగస్టు 15 నుండి గత వైసీపీ ప్రభుత్వం జీవోఐఆర్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ ను నిలుపుదల చేయడంపై నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో ని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2021 నుండి నిలిచిపోయిన జీవోఐఆర్ వెబ్ పోర్టల్ ను పునరుద్దరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News