Raj Tarun: అప్పుడే 'ఆహా' తెరపైకి వస్తున్న కొత్త సినిమాలివే!
- జులై 26న వచ్చిన 'పురుషోత్తముడు'
- ఈ నెల 29 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
- జులై 12న విడుదలైన 'సారంగదరియా'
- ఈ నెల 31 నుంచి 'ఆహా'లో అందుబాటులోకి
'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి ఈ వారం రెండు తెలుగు సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఇటీవలే థియేటర్స్ కి వచ్చినవి కావడం విశేషం. వాటిలో ఒకటి 'పురుషోత్తముడు' అయితే, మరొకటి 'సారంగదరియా'. రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన 'పురుషోత్తముడు', జులై 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాతోనే హాసిని సుధీర్ కథానాయికగా టాలీవుడ్ కి పరిచయమైంది.
ఈ సినిమాలో హీరో లండన్ నుంచి తిరిగొచ్చిన యువకుడిగా రామ్ పాత్రలో కనిపిస్తాడు. అతను శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడు. తండ్రి ముచ్చట తీర్చడం కోసం సీఈవోగా ఉండాలనుకున్న అతని ముందు కొన్ని సవాళ్లు నిలబడతాయి. ఆ సవాళ్లను ఒక సామాన్యుడిగా ఎలా ఎదుర్కొంటాడు? అనేదే కథ. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఇదే 'ఆహా' సెంటర్ కి రావడానికి 'సారంగదరియా' సినిమా రెడీ అవుతోంది. రాజా రవీంద్ర ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాకి పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించాడు. జులై 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 31వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. సమస్యల వలయంలో చిక్కుకున్న ఒక మధ్యతరగతి కుటుంబీకుడి కథనే ఇది.