Industrial Hubs: కొప్పర్తి, ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయి: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
- ఏపీపై కేంద్రం కరుణ
- కొప్పర్తి, ఓర్వకల్లులో భారీ వ్యయంతో ఇండస్ట్రియల్ హబ్ లు
- వేల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
- దాదాపు లక్ష మందికి ఉపాధి
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఏపీపై కరుణ చూపిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ... కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయని వెల్లడించారు.
ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ వస్తోందని తెలిపారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ప్రాజెక్టు వ్యయం రూ.2,786 కోట్లు అని వివరించారు. ఈ పారిశ్రామిక హబ్ లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీని ద్వారా 45 వేల మందికి ఉపాధి కలుగుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇక, కొప్పర్తి పారిశ్రామిక హబ్ ను 2,596 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీని కోసం రూ.2,137 కోట్ల వ్యయం చేయనున్నారని పేర్కొన్నారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ ద్వారా 54 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు.