Samantha: హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత ఏమ‌న్నారంటే..!

Actor Samantha hails WCC efforts that led to Hema Committee report

  • మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక‌
  • డ‌బ్ల్యూసీసీ చొర‌వ‌ వల్లే కమిటీ నివేదిక సాధ్య‌మైంద‌న్న సమంత  
  • పని ప్రదేశాల్లో భద్రత అనేది మహిళల కనీస అవసరమ‌ని వ్యాఖ్య‌

మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా షాకింగ్‌ విషయాలు బయటప‌డ్డాయి. దాంతో ఈ రిపోర్ట్‌పై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. తాజాగా దీనిపై న‌టి సమంత స్పందించింది.

హేమ క‌మిటీ ప‌నితీరు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసిన స‌మంత‌.. ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్ (డ‌బ్ల్యూసీసీ) చొర‌వ‌ వల్లే కమిటీ నివేదిక సాధ్య‌మైంద‌ని తెలిపింది. సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి డబ్ల్యూసీసీ కృషి అమోఘ‌మ‌ని మెచ్చుకుంది. పని ప్రదేశాల్లో భద్రత అనేది మహిళల కనీస అవసరమని ఈ సంద‌ర్భంగా ఆమె పేర్కొంది.

"కేరళలోని డబ్ల్యూసీసీ పని తీరును నేను చాలా కాలంగా గమనిస్తున్నాను. డబ్ల్యూసీసీ నిర్ణయం వల్లే హేమ కమిటీ నివేదిక సాధ్య‌మైంది. ఈ రిపోర్ట్ ద్వారా ప‌రిశ్ర‌మ‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలు. 

అయినా ఇప్పటికీ వీటి కోసం చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలకు ఫలితం శూన్యం. కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై త‌గిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. డబ్ల్యూసీసీలో ఉన్న నా మిత్రుల‌కు, సోదరీ మణులకు ధ‌న్యావాదాలు తెలుపుతున్నాను" అని సమంత చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News