BRS: అవి చిట్ చాట్‌లు కాదు.. చీట్ చాట్లు: హరీశ్ రావు విసుర్లు

BRS Ex Minister harish rao fires on congress government

  • రాజీనామా చేయడానికి కట్టుబడి ఉన్నానన్న హరీశ్ రావు   
  • వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్న
  • కూల్చివేతల ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ మారిందని విమర్శ

తాను ఇప్పటికీ రాజీనామా చేయడానికి కట్టుబడి ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా మొత్తం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు. రుణ మాఫీ పాక్షికంగా మాత్రమే అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదని.. చీట్ చాట్‌లని విమర్శించారు. చిట్ చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణ మాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు.  
 
వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. బడే భాయ్.. చోటా భాయ్ కాబట్టే తెలంగాణలో విచారణ చేయట్లేదని అన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్‌పై మాట్లాడటం లేదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. బుద్ధ భవన్‌లో హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా మీదనే ఉన్నాయని, ముందు వీటిని, నెక్లెస్ రోడ్డులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, ఐ మ్యాక్స్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులతో పాటు పరిహారం కూడా ఇవ్వాలని అన్నారు.

  • Loading...

More Telugu News