Tyagaraya Gana Sabha: హైదరాబాదు త్యాగరాయ గానసభలో ఏడో ఆడిటోరియం ప్రారంభం

KV Ramanachary inaugurated 7th auditorium in Tyagaraya Gana Sabha
  • ప్రారంభించిన ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు  కేవీ రమణాచారి
  • కేంద్ర ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యుడు జనార్థనమూర్తి కృషితో అందుబాటులోకి
  • సంగీత ఉత్సవాలు, ఉచిత నాట్య, సంగీత తరగతులకు వినియోగం
  • ఏడుకొండలవాడి దయతోనే జనార్ధనమూర్తికి ఇది సాధ్యమైందన్న పురాణపండ
కళలకు నిలయమై, కళాకారులు, సాహిత్యకారులకు ప్రీతిపాత్రమైన హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో వేదిక అందుబాటులోకి వచ్చింది. సంగీత ఉత్సవాలకు, ఉచిత సంగీత, నాట్య తరగతుల కోసం దీనిని ప్రారంభించారు. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు కళా జనార్దనమూర్తి పరవేక్షలో ఈ ఏడో ఆడిటోరియంను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిని ప్రారంభించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అంతకుముందు ప్రముఖ రచయిత,  ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ' ఆరాధన ' పూర్వ సంపాదకుడు పురాణపండ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడు కొండలవాడి దయతోనే జనార్దనమూర్తికి ఇది సాకారమైందని పేర్కొన్నారు. సంగీత, నాట్య రంగంలో కొత్త తరాల శిక్షణ కోసం శ్రమించి, పరిశ్రమించి మరీ ఈ ఆడిటోరియంను నిర్మించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ప్రముఖ పాత్రికేయుడు శంకరనారాయణ, త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్,  పద్మజ నీలిమ , గీత, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tyagaraya Gana Sabha
Puranapanda Srinivas
KV Ramanachary
Kala Janardhana Murthy

More Telugu News