Pet Dogs: పెంపుడు శునకాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..?
- యజమానులను కంటికి రెప్పలా కాపాడుకునే జర్మన్ షెపర్డ్
- పిల్లలను ఆడిస్తూ ఆడుకునే బుల్ డాగ్
- ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే హవనీస్
మనుషులకు అత్యంత నమ్మకమైన మిత్రుడు, విశ్వాసానికి మారు పేరు శునకం.. వీధి కుక్క అయినా కాస్త తిండి పెడితే విశ్వాసంగా మన చుట్టూనే తిరుగుతుంటుంది. అలాంటి విశ్వాసపాత్రమైన జంతువును ఇంట్లో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే, పెంపుడు శునకాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. రక్షణ కోసం కొన్ని, పిల్లలతో కలిసి ఆడుకునేందుకు కొన్ని.. ఇలా రకరకాల జాతులు వాటితో రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. చిన్నగా, తెల్లటి జుత్తుతో ముద్దొచ్చే హవనీస్ డాగ్ ను పెంచుకోవడానికి ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడుతుంటారట. పిల్లలతో కలిసిపోయి ఆడుకోవడంలో బుల్ డాగ్ ను మించింది లేదు.
ఇంటికి రక్షణ, దొంగల భయం లేకుండా ఉండేందుకు జర్మన్ షెఫర్డ్ డాగ్ ఉండనే ఉంది. యజమాని పట్ల అభిమానంతో ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఈ డాగ్ పెట్టింది పేరు. దీని శక్తిసామర్థ్యాలను గుర్తించి చాలా దేశాలు వీటిని పోలీస్, మిలటరీ సేవలకు ఉపయోగించుకుంటున్నాయి. శిక్షణ ఇచ్చి వీటితో మందుపాతరలను గుర్తించడం సహా ఎన్నో రిస్కీ ఆపరేషన్లు చేయించుకుంటున్నాయి. కొన్ని శునకాలకు సైన్యంలో ర్యాంకులు, ఆఫీసర్ హోదా కూడా ఉందంటే వీటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఇక పెంపుడు శునకాలను కన్నబిడ్డల్లా చూసుకునే వారికి కొదవేలేదు. పెంపుడు శునకాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి.. మీ ఇంట్లో పెంచుకోవడానికి ఏ శునకం బెస్ట్ అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.