AP Rains: ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్... 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు
- గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్
- బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
కుండపోత వర్షాలతో ఏపీ అతలాకుతలం అయింది. మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు, విజయవాడలోని సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. వరద దాటే ప్రయత్నం చేసిన ఓ మహిళ... నీటిని దాటుతూ గుండెపోటుతో మృతి చెందింది. మృతదేహాన్ని తరలించలేక స్థానికులు కారుపై పెట్టారు. ఈ విషాదకర ఘటన గంగానమ్మ గుడి ఎదురుగా మసీదు రోడ్డులో చోటుచేసుకుంది. మొత్తం జలమయం కావడంతో సింగ్ నగర్ లో జనజీవనం స్తంభించింది.