Kannappa Movie: ‘కన్నప్ప’ నుంచి ‘కాలాముఖ’గా అర్పిత్ రంకా ఫస్ట్ లుక్ పోస్టర్

Kalamukha first look from Kannappa released
  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 'కన్నప్ప'
  • ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల
  • డిసెంబర్ లో విడుదల కానున్న చిత్రం
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను టీం విడుదల చేసింది.

'కన్నప్ప' నుంచి 'కాలాముఖ' పాత్రకు సంబంధించి అర్పిత్ రంకా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గాంధార దేశం... వాయు లింగం సొంతం చేసుకునే ధ్యేయం... వేలాది మంది రక్తపాతాన్ని చూసే దాహం... అడవిని, అడవి వీరుల్ని సైతం అంతం చేసే క్రూరత్వం అంటూ కాలాముఖ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, పోస్టర్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే 'కన్నప్ప' టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
Kannappa Movie
Manchu Vishnu
Kalamukha

More Telugu News