Revanth Reddy: కవితకు బెయిల్‌పై పోస్టులు... రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
- కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులు
- బెయిల్ వచ్చిందా? ఇచ్చారా? అంటూ పోస్టులు
- ఈ పోస్టులపై వివరణ ఇవ్వాలంటూ రేవంత్‌కు నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు వివరణ అడిగింది. కవిత బెయిల్ అంశంపై సోషల్ మీడియా పోస్టులను సీరియస్‌గా తీసుకుంది.
కవితకు బెయిల్ వచ్చిందా? ఇచ్చారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ చేసింది. కమలంతో స్నేహం... కవితక్కకు మోక్షం అంటూ పేర్కొంది. తెలంగాణ కాంగ్రెస్ పోస్టులపై వివరణ ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు రెండు వారాల గడువును ఇచ్చింది.