Telangana: విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు
- చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు
- త్వరలో వీరిని నియమించనున్నట్లు వెల్లడి
రాష్ట్ర విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.
చైర్మన్, సభ్యులను త్వరలో నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.